
సితార అన్న టైటిల్ వింటే తెలుగు సినీ అభిమానికి ప్రముఖ దర్శకుడు వంశీ రూపొందించిన క్లాసిక్ ‘సితార’ సినిమా గుర్తుకువస్తుంది. ఇప్పుడదే టైటిల్‌తో రవిబాబు ప్రధాన పాత్రలో నటించగా సురేంద్ర జి. ఎల్. ఒక సినిమా రూపొందించారు. పాత సితార సినిమాలోలానే సినిమానే బ్యాక్‌డ్రాప్‌గా తీసుకొని రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని రేపు విడుదలకు సిద్ధమైంది. రవనీత్ కౌర్, సుమన్, అశ్విన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను జీనస్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై రవికుమార్ డి.ఎస్. నిర్మించారు.
ఇక రేపు సినిమా విడుదలవుతోన్న సందర్భంగా సితార యూనిట్ పత్రికలతో ముచ్చటించింది. ఒక దర్శకుడు, హీరోయిన్‌ల చుట్టూ తిరిగే ఆసక్తికర కథనంతో ఈ సినిమా తెరకెక్కిందని, అన్నివర్గాల ప్రేక్షకులనూ అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని దర్శక నిర్మాతలు తెలిపారు. రవిబాబు యాక్టింగ్ ఈ సినిమా ఓ హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఘంటాడి కృష్ణ, రామ్ పైడిశెట్టి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బళ్ళారి రఘు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.

