ఓటీటీ సమీక్ష: శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ – తెలుగు డబ్ చిత్రం జీ 5 లో ప్రసారం

ఓటీటీ సమీక్ష: శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ – తెలుగు డబ్ చిత్రం జీ 5 లో ప్రసారం

Published on Feb 7, 2026 6:10 PM IST

parasakthi

ఓటీటీ వేదిక : జీ5
ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : ఫిబ్రవరి 07, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : శివ కార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అథర్వ, రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్ తదితరులు
దర్శకత్వం : సుధా కొంగర
నిర్మాత : ఆకాష్ భాస్కరన్
సంగీతం : జీవీ ప్రకాష్
సినిమాటోగ్రఫీ : రవి కే చంద్రన్
ఎడిటింగ్ : సతీష్ సూర్య

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

తమిళ టాలెంటెడ్ నటుడు శివ కార్తికేయన్ హీరోగా శ్రీలీల తమిళ డెబ్యూ ఇస్తూ చేసిన లేటెస్ట్ చిత్రమే “పరాశక్తి” (Parasakthi) తెలుగులో కూడా థియేటర్స్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలో తెలుగు వెర్షన్ విడుదల చేసుకుంది. జీ 5 లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

Parasakthi కథ:

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ బ్రిటీష్ వారిచే చొప్పించబడ్డ ఆంగ్ల భాష కాకుండా కేవలం దేశమంతా ఒకటే దేశ భాష ఉండాలనే చట్టాన్ని అప్పటి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. కానీ దీని విషయంలో దక్షిణాదిన తమిళనాడు నుంచి చెలియన్ (శివ కార్తికేయన్) అనే యువ విద్యార్థి, నాయకుడు తిరుగుబాటు చాలామందిని హిందీని చొప్పించడంపై ప్రేరేపించి తన దారిలోనే నడిచేలా చేస్తుంది. ఈ క్రమంలో చెలియన్ పోరాటం అడ్డుకోవాలని కేంద్రం నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ తిరు (రవి మోహన్) ని నియమిస్తుంది. ఇక్కడ నుంచి వీరి వైరం ఇంకోపక్క, తమ మాతృ భాషను కాపాడుకునే పోరాటాన్ని చెలియన్ ఎలా సాగించాడు? ఈ క్రమంలో తన సోదరుడు చిన్న దురై (అథర్వ), ప్రేయసి రత్నమాల (శ్రీలీల) ఎలా సాయపడ్డారు. ఒక సమయంలో ఈ పోరాటాన్ని వదిలేసిన చెలియన్ మళ్లీ ఎందుకు వెనక్కి వచ్చి తన మాతృ భాష కోసం అంతలా పోరాటం చేసాడు. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

తమ మాతృ భాష పట్ల మక్కువ ఉన్న ప్రతీ ఒక్కరికీ ఈ (Parasakthi) సినిమా ఒకింత బాగా కనెక్ట్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా పలు కథనాల్లో ఇతర భాషాలని పలు రాష్ట్రాల్లో రుద్దడం లాంటివి వింటూనే ఉంటాం. కానీ వాటికి ఒకప్పుడు జరిగిన చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు. అలా తెలియని వారికి తెలిసేలా దర్శకురాలు సుధా కొంగర చేసిన ప్రయత్నం డీసెంట్ గా ఉంది.

ముఖ్యంగా ఆమె బ్యాలన్స్డ్ గా చాలా చోట్ల హ్యాండిల్ చేశారు. సినిమాలోని ఎమోషన్ కి తగ్గట్టుగా చూపించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా వర్కవుట్ అవుతాయి. ముఖ్యంగా శివ కార్తికేయన్ ఢిల్లీలో ఉద్యోగం కోసం వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ చేసే సీన్ గాని ఆ తర్వాత వచ్చే ఓ సన్నివేశం బాగున్నాయి. ఇక నటీనటుల్లో దాదాపు అంతా తమ బెస్ట్ ఇచ్చారు.

శివకార్తికేయన్ చెలియన్ గా చాలా బాగా చేసాడు. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో తన నటన కదిలిస్తుంది. ఇక హీరోయిన్ శ్రీలీలకి ఇది తమిళ్ లో మంచి డెబ్యూ అని చెప్పవచ్చు. ఆమెకి, శివకార్తికేయన్ నడుమ సన్నివేశాలు, ఫస్టాఫ్ లో వారి కెమిస్ట్రీ చాలా బాగుంది. అంతేకాకుండా శ్రీలీల ఈ సినిమాలో చాలా అందంగా కూడా కనిపిస్తుంది. తన వేషధారణ ఆమెని మరింత ఆకర్షణీయంగా చూపించాయి.

ఇక వీరితో పాటుగా అథర్వ కూడా తన రోల్ లో బాగా చేసాడు. రవి మోహన్ మంచి విలనిజాన్ని ప్రదర్శించాడు. రానా దగ్గుబాటి కామియో బాగుంది. కానీ బాసిల్ జోసెఫ్ కామియో మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది. వీరితో పాటుగా ఇతర నటీనటులు అంతా బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలో మంచి కథాంశం ఉంది కాని అందుకు తగ్గట్టుగా మరింత బలమైన ఎమోషనల్ కథనం కొంచెం మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఉన్నంతలో కొన్ని సీన్స్ ప్రభావం చూపిస్తాయి కానీ ఇంకా బలమైన ఎమోషన్స్ ని కోరుకునే వారికి ఈ సినిమా కొంచెం నిరాశ కలిగించవచ్చు.

అంతేకాకుండా కొన్ని పాత్రలు ఇంకా బెటర్ గా డిజైన్ చేయాల్సింది. రవి మోహన్ రోల్ ని ఇంకా పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయాల్సింది. అలాగే రానా దగ్గుబాటి కామియో ఎంట్రీ ఇచ్చినప్పుడు తెలుగు ఆడియెన్స్ లో మంచి ఎగ్జైటెడ్ గా అనిపిస్తుంది కానీ తన పాత్రని అంత బలంగా చూపించకుండా ముగించడం నిరాశ పరుస్తుంది.

అలానే సెకండాఫ్ లో డ్యూయెట్ సాంగ్ ని కూడా తీసేయాల్సింది. కొన్ని చోట్ల స్లో కథనం లాంటివి ఈ సినిమాలో నిరుత్సాహ పరుస్తాయి.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ఆ వింటేజ్ సెటప్ తాలూకా ప్రొడక్షన్ డిజైన్ చాలా బాగుంది. కెమెరా వర్క్ కూడా ఒక పర్ఫెక్ట్ పీరియాడిక్ సినిమాని విజువల్ గా ప్రెజెంట్ చేశారు. కానీ వి ఎఫ్ ఎక్స్ వర్క్ మాత్రం వీక్ గా ఉంది. జీవీ ప్రకాష్ సంగీతం బాగుంది. నేపథ్య గీతం కొన్ని సీన్స్ లో బాగా వర్క్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్ గా చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది.

ఇక దర్శకురాలు సుధ కొంగరా విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకు పర్వాలేదు కానీ తన ట్రాక్ రికార్డ్ పై మంచి ఐడియా ఉన్నవారికి మాత్రం ఎక్కడో ఆమె మార్క్ కొంచెం మిస్ అయ్యినట్టు అనిపిస్తుంది. చాలా చోట్ల సుధా కొంగరా వర్క్ బాగుంది కానీ ఇంకా బలమైన ఎమోషన్స్ తో కూడిన కథనం ఇందులో ప్లాన్ చేయాల్సింది. ఉదాహరణకు రాజ్ కుమార్ హిరాని మంచి హిట్టింగ్ సినిమాలు చూశాక డంకీ ఎలా అనిపించిందో ఇది కూడా సుధా కొంగర నుంచి అలా అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టైతే ఈ “పరాశక్తి” (Parasakthi) విషయానికి వస్తే.. ఇందులో శివ కార్తికేయన్ తన సిన్సియర్ పెర్ఫామెన్స్ ని అందించాడు. అలాగే శ్రీలీల కూడా సర్ప్రైజ్ చేస్తుంది. అంతేకాకుండా ఈ పీరియాడిక్ డ్రామాలో మాతృభాష విషయంలో చూపించిన కొన్ని సన్నివేశాలు ఎమోషన్స్ బాగున్నాయి. కానీ సుధా కొంగరా వర్క్ పరంగా ఈ సినిమాపై ఎక్కువ అంచనాలు పెట్టుకున్నవారిని మాత్రం ఈ సినిమా డిజప్పాయింట్ చేస్తుంది. కొన్ని స్లో సీన్స్, కొన్ని వీక్ పాత్రలు సినిమాని కొంచెం డల్ గా మార్చాయి. సో ఈ సినిమా బాగా తక్కువ అంచనాలు పెట్టుకొని ట్రై చేస్తే మంచిది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు