శివకార్తికేయన్ #SK20 ఫస్ట్ లుక్ రేపు విడుదల!

Published on Jun 8, 2022 6:29 pm IST


కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్, సిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన డాన్‌తో మంచి హిట్ సాధించాడు. ప్రస్తుతం ఈ నటుడు తెలుగు దర్శకుడు అనుదీప్ కే తో తన తదుపరి చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రేపు ప్రకటిస్తామని చిత్ర నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

అయితే ఈ పోస్టర్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా ఈ తెలుగు – తమిళ చిత్రంలో హీరోయిన్ గా కనిపించనుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్ మరియు శాంతి టాకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :