ఆ క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ !

Published on Apr 16, 2019 3:38 pm IST

నిన్నుకోరి , మజిలీ తో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు కొట్టి క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు శివ నిర్వాణ. ఇక ఈ దర్శకుడు సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తో సినిమా చేయనున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమేనని సమాచారం. మజిలీ చిత్ర నిర్మాత సాహూ గారపాటి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మా సంస్థలో శివ నిర్వాణ , విజయ్ దేవరకొండ కాంభినేషన్ లో సినిమా ఉంటుందని వచ్చే నెలలో విజయ్ కు పూర్తి కథ చెప్పనున్నామని ఆయన అన్నారు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రానుండడం దాదాపుగా ఫిక్స్ అయిపోయింది.

మజిలీ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్ ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి ఎమోషనల్ లవ్ స్టోరీస్ మొదటి రెండు చిత్రాలను తెరకెక్కించి విజయం సాధించిన శివ , విజయ్ కోసం ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :