విడుదలకు సిద్దమైన ‘శివ కేశవ్’

విడుదలకు సిద్దమైన ‘శివ కేశవ్’

Published on Jun 5, 2014 8:53 AM IST

sri-hari
రియల్ స్టార్ డా.శ్రీ హరి గారు నటించిన ఆఖరి సినిమా ‘శివ కేశవ్’ విడుదలకు సిద్దమైంది. బానురు నాగరాజ్ (జడ్చర్ల) నిర్మిస్తున్న ఈ సినిమాను బానురు శ్రావని – సాయినాథ్ లు సమర్పిస్తున్నారు. జయంత్, శ్వేతా బసు ప్రసాద్, గుర్లీన్ చోప్రా, నాగబాబు, కృష్ణ భగవాన్ లు ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీ వసంత సంగీతం సమకూరుస్తున్నారు.

సినిమా గురించి నిర్మాత నాగరాజ్ మాట్లాడుతూ, “సినిమాలో శ్రీ హరి చేసిన ఫైట్ లు మరియు తన పెర్ఫార్మన్స్ సినిమాకు హై లైట్ గా నిలుస్తాయి. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని, త్వరలో విడుదలకు సిద్దమైందని తెలిపారు. సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు”.

తాజా వార్తలు