శివగామిగా నటించబోతున్న సీరియల్‌ నటి !

శివగామిగా నటించబోతున్న సీరియల్‌ నటి !

Published on Sep 19, 2018 9:09 AM IST

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి-1, 2’ చిత్రాల ఏ స్థాయిలో విజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను వెబ్ సిరీస్ రూపంలో తీసుకురానుంది. బాహుబలి కథకు ముందు శివగామి బాల్యం ఏమిటి, ఆమె ఎదుగుదల ఎలా సాగింది.. ఇలా ప్రధానంగా శివగామి పాయింటాఫ్ వ్యూలో ఈ వెబ్‌ సీరీస్‌ తెరకెక్కనుంది.

కాగా, తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ వెబ్‌ సీరీస్‌ లోని ముఖ్య పాత్ర అయిన శివగామి పాత్రను, హిందీ నటి మృణాల్‌ థాకూర్‌ పోషిస్తున్నారు. అయితే చిత్రబృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాకపొతే శివగామి పాత్రను మృణాల్‌ పోషించడం దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. గతంలో మృణాల్ కుంకుమ్‌ భాగ్య సీరియల్‌ తో బాగానే ఆకట్టుకుంది. మరి శివగామి పాత్రలో ఆమె ఎలా నటిస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు