‘సైజ్ జీరో’- తమిళ్ ఓవర్, ఇక మిగిలింది తెలుగే.!

‘సైజ్ జీరో’- తమిళ్ ఓవర్, ఇక మిగిలింది తెలుగే.!

Published on Oct 29, 2015 5:47 PM IST

size-zero1
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన యోగ బ్యూటీ అనుష్క ఈ ఏడాది బాహుబలి మరియు రుద్రమదేవి అనే రెండు ప్రీరియాద్ ఫిల్మ్స్ తో విజయాలను అందుకుంది. ఈ సినిమాల తర్వాత ఓ పాత్ర కోసం 20 కేజీల బరువు పెరిగి చేసిన లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘సైజ్ జీరో’. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమాని తమిళంలో ‘ఇందు ఇడుప్పఝగి’ అనే టైటిల్ ని రిలీజ్ చేస్తున్నారు. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకున్న ఈ సినిమా సరైన రిలీజ్ లేక పలుసార్లు వాయిదా పడింది.

ఫైనల్ గా ఈ సినిమా ఆడియోని నవంబర్ 1న తెలుగులో రిలీజ్ చేసి సినిమాని నవంబర్ 27న ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. అందులో ముందుగా తమిళ వెర్షన్ ఆడియోని రిలీజ్ చేసారు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించిన ఈ ఆడియోని నిన్న సాయంత్రం పలువురు ప్రముఖుల సమక్షంలో రిలీజ్ చేసారు. అలాగే తమిళ ఆడియన్స్ నుంచి ఆడియోకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. అనుష్క సరసన ఆర్య హీరోగా కనిపించనున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనుంది. అలాగే నాగార్జున, శృతి హాసన్ ఓ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాని పివిపి నిర్మించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు