‘సైజ్ జీరో’ ట్రైలర్‌తో కట్టిపడేస్తోన్న అనుష్క!

‘సైజ్ జీరో’ ట్రైలర్‌తో కట్టిపడేస్తోన్న అనుష్క!

Published on Nov 2, 2015 11:10 PM IST

size-zero
తెలుగు, తమిళ భాషల్లో నటిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న అనుష్క, తాజాగా సైజ్ జీరో సినిమా కోసం ఓ పెద్ద సాహసాన్నే చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఏకంగా 25 కేజీల బరువు పెరిగి నటనపై, సినిమాలపై తనకున్న మక్కువను చూపుకున్నారు. ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందిన సైజ్ జీరో సినిమాను పీవీపీ సినిమా నిర్మించింది. ఇక కీరవాణి సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో ఆవిష్కరించారు. పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగిన ఆడియో వేడుకలో సినిమా ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను కూడా లాంచ్ చేశారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమా ఏ స్థాయిలో ఓ ఫ్రెష్ ఫీల్ ఇవ్వనుందో తెలియజెప్పిన టీమ్, ఈ ట్రైలర్‌తో అంచనాలను మరింతగా పెంచేసింది. అనుష్క బ్రాండ్ యాక్టింగ్‌ను ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఇక ఆర్య-అనుష్కల కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. బరువు తగ్గేందుకు అనుష్క పడే పాట్లు, తనకు తాను కాన్ఫిడెంట్‌గా నిలబడడం, చివర్లో వచ్చే డైలాగ్.. ఇలా ఈ ట్రైలర్‌లో రకరకాల ఎమోషన్స్‌తో అనుష్క కట్టిపడేసిందనే చెప్పాలి. “పెళ్ళికి ముందు లావంటే రిజెక్ట్ చేస్తారా? పెళ్ళయ్యాక లావైతే డివోర్స్ ఇచ్చేస్తారా?” అంటూ అనుష్క చివర్లో చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మంచి ఫీల్‌తో ముగిసింది. ఇక ఈ ట్రైలర్‌తో అంచనాలను మళ్ళీ పెంచేసిన సినిమా అదే స్థాయిలో అలరిస్తుందా తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే నవంబర్ 27వరకూ చూడాల్సిందే!

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు