బన్నీ ప్లాన్ లో చిన్న మార్పు.!?

Published on Jun 11, 2021 9:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ వైపు అంగలు వేస్తున్నాడు. ఎప్పుడు ప్లాన్ చేసిన ఈ పాన్ ఇండియన్ ఎంట్రీ ఎట్టకేలకు స్టార్ దర్శకుడు సుకుమార్ తో హ్యాట్రిక్ సినిమాగా “పుష్ప” ని తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా దాని తర్వాత బన్నీ చెయ్యబోయే సినిమాలపై కూడా సాలిడ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది.

అయితే మొదటగా బన్నీ పుష్ప రెండు భాగాలు కంప్లీట్ చేసేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు వెళ్లనున్నారని తెలిసిందే. పార్ట్ 1 అయ్యిన వెంటనే పార్ట్ 2 కూడా స్టార్ట్ చేసి ముగించేస్తారని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం బన్నీ ప్లాన్ లో చిన్న మార్పు వచ్చినట్టు తెలుస్తుంది.

మరి దాని ప్రకారం పుష్ప పార్ట్ 2 కంప్లీట్ చేసేదానికన్నా ముందు బన్నీ అసలైన మొట్టమొదటి పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “ఐకాన్” ను ఫినిష్ చేసేయనున్నాడట. దర్శకుడు వేణు శ్రీరామ్ తో ఎప్పుడో ప్లాన్ చేసిన పాన్ ఇండియన్ సినిమా ఇది. అలాగే దీని కోసం బన్నీ ఫ్యాన్స్ కూడా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు.

పైగా సుకుమార్ కూడా కాస్త బ్రేక్ కోరుకుంటుండడంతో ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ రేస్ లోకి వచ్చేసింది. మరి ఇది ఎప్పుడు నుంచి మొదలు కానుందో చూడాలి.

సంబంధిత సమాచారం :