
ప్రకాష్ రాజ్ ఉలవచారు బిర్యాని సినిమాతో స్నేహ రీ ఎంట్రీ ఇవ్వనుంది. 2011లో రాజన్న సినిమాలో నటించినా ఆశించిన ఫలితం రాలేదు. ఈ సినిమాకు ప్రకాష్ రాజ్ దర్శకుడు. ఊర్వశి, సంయుక్త, తేజ మరియు బ్రహ్మాజీ ముఖ్యపాత్రధారులు
ప్రస్తుతం ఈ సినిమా రీ రికార్డింగ్ దశలోవుంది. సినిమాలో స్నేహ నటన చూసి ఇళయరాజా గారు ఈమెను ప్రశంసించారట. “ఒక్క క్షణం రాజా గారు ఆయన పని ఆపి,నన్నుచూసి, నువ్వు బాగా నటించావు అని చెప్పారు..”చాలు.. ఇంతకన్నా ఈ జీవితానికి ఏం కావాలని స్నేహ ఆనందంతో పోస్ట్ చేసింది
ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ అద్భుతమైన నటన కనబరిచాడు. నా సినిమాకు ఇంతమంచి సంగీతం అందించిన ఇళయరాజా గారికి నా కృతజ్ఞతలు అని ప్రకాష్ రాజ్ తెలిపాడు. ఈ సినిమాలో తమిళ, తెలుగు మరియు కన్నడ బాషలలో మే నెలలో విడుదలకానుంది

