నేడే సన్నాఫ్ సత్యామూర్తి ఆడియో వేడుక!

నేడే సన్నాఫ్ సత్యామూర్తి ఆడియో వేడుక!

Published on Mar 15, 2015 3:24 PM IST

So-Sathyamurthy
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో ‘జులాయి’ లాంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం.. ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆడియో విడుదలను నేటి (మార్చి 15) రాత్రి హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు సినిమా యూనిట్ మొత్తం హాజరయ్యేలా ప్లాన్ చేశారు. ఎక్కడా బోర్ కొట్టకుండా వినూత్నంగా ఆడియో విడుదలను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫంక్షన్‌కు అల్లు అర్జునే ప్రధాన ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్‌తో పాటు సినిమాలో నటించిన హీరోయిన్లు సమంత, అదా శర్మ, నిత్యామీనన్‌లు మరో ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవాలి. ముగ్గురు హీరోయిన్లు వేదికను పంచుకోవడం అభిమానులకు నిజంగా కనులవిందే. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా ఆడియో పట్ల ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది. అంచనాలను అందుకునే రేంజ్‌లోనే పాటలు రూపొందినట్లు తెలుస్తోంది. కె. రాధాకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు