
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య గత వారం విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం, సినిమాకు మంచి స్పందన రావడంతో ‘S/O సత్యమూర్తి’ మొదటి వారం కలెక్షన్లను కుమ్మేసింది. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
S/O సత్యమూర్తి సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ రికార్డు కలెక్షన్లతో దుమ్ము దులుపుతోంది. నైజాం, ఆంధ్రా, సీడెడ్, అమెరికా ఇలా అన్ని ప్రాంతాల్లో రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమా మొదటి వారం కలెక్షన్ల విషయంలో ఇంతవరకూ ఏ తెలుగు సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. కర్ణాటకలో ఈ సినిమా మొదటివారం 4.75కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ కర్ణాటకలో మొదటివారం కలెక్షన్ల విషయంలో ఈ సినిమాదే రికార్డు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హారిక ఆన్డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.

