గ్రాండ్‌గా ‘S/O సత్యమూర్తి’ ఆడియో సక్సెస్ మీట్!

Son-of-Satyamurty-success-m
‘అత్తారింటికి దారేది’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో, ‘రేసుగుర్రం’ లాంటి సూపర్‌ హిట్‌తో జోరు మీదున్న అల్లు అర్జున్ నటించిన చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. ప్రచార చిత్రాలు, ట్రైలర్ ద్వారా ఇప్పటికే ప్రేక్షకుడిలో ఆసక్తిని రేకెత్తించిన సన్నాఫ్ సత్యమూర్తి, విడుదలకు ముందే సంచనాలను నమోదు చేసిన విషయం తెలిసిందే! సినిమాకి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవీశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మార్చి 15న విడుదల అయిన ఆడియో అభిమానుల్లో జోరును నింపింది.

ఇక ఆడియో సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా ఈ ఆడియోకి సంబంధించిన సక్సెస్ మీట్‌ను నిన్న సాయంత్రం నిర్వహించారు. విజయవాడలోని హాయ్‌లాండ్‌ను ఆడియో సక్సెస్ మీట్‌కు వేదికగా ఎంచుకున్నారు. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రం, హీరోయిన్ అదా శర్మ, నిర్మాత రాధాకృష్ణ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, ఆలీ, బ్రహ్మనందం తదితరులు పాల్గొన్నారు. ఈ సక్సెస్ మీట్‌కు భారీ ఎత్తున ప్రేక్షకులు హాజరయ్యారు. సినిమాపై ఇటు అభిమానుల్లోనూ, అటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలన్నీ అందుకునే రేంజ్‌లోనే సినిమా ఉండనుందనేది సమాచారం. అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఏప్రిల్ 9న విడుదల కానుంది.

Exit mobile version