“మంచి రోజులు వచ్చాయి” నుండి సో సో గా సాంగ్ ప్రోమో విడుదల!

Published on Aug 11, 2021 12:37 pm IST


మారుతీ దర్శకత్వంలో సంతోష్ శోభన్ మరియు మేహరీన్ హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న తాజా చిత్రం మంచి రోజులు వచ్చాయి. ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుండి తాజాగా సో సో గా అనే సాంగ్ ప్రోమో తాజాగా విడుదల అయింది. ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందిస్తున్నారు. విడుదల అయిన సో సో గా ప్రోమో యూత్ ను అలరించే విధంగా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట కి కే కే లిరిక్స్ అందించారు. ఇందుకు సంబంధించిన పూర్తి పాట ఈ నెల 16 వ తేదీన విడుదల కానుంది.

యూ వి క్రియేషన్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సమర్పణలో వి సెల్యూలాయిడ్ మరియు ఎస్కేఎన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సాంగ్ ప్రోమో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :