ఓటిటి సమీక్ష: ‘చీకటిలో’ – తెలుగు వెబ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఓటిటి సమీక్ష: ‘చీకటిలో’ – తెలుగు వెబ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో

Published on Jan 23, 2026 11:03 AM IST

Cheekatilo 2

విడుదల తేదీ : జనవరి 23, 2025
స్ట్రీమింగ్ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రాచకొండ, చైతన్య విశాలక్ష్మి, ఇషా చావ్లా, ఝాన్సీ, ఆమని, వడ్లమని శ్రీనివాస్, రవీంద్ర విజయ్
దర్శకుడు: శరన్ కొప్పిశెట్టి
నిర్మాత: డి. సురేష్ బాబు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: మల్లికార్జున్
కూర్పు: కే ఎస్ ఎన్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ అందులోని తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ చాలా కాలం తర్వాత చేసిన లేటెస్ట్ చిత్రమే ‘చీకటిలో’. తన ఓటిటి డెబ్యూగా వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు నేడు తీసుకొచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

తనకంటూ కొన్ని విలువలు పెట్టుకొని జర్నలిస్ట్ గా పని చేసే అమ్మాయి సంధ్య (శోభిత ధూళిపాళ), ఈ టీఆర్పీ ప్రపంచంలో ఇబ్బందికర వార్తలు కూడా చదవాల్సి వస్తుంది. దీనితో ఆ ఉద్యోగం వదిలేసి తన కొలీగ్, స్నేహితురాలు బాబీ (అదితి మ్యాకల్) ఇచ్చిన ఐడియాతో పాడ్ కాస్ట్ లోకి దిగుతుంది. కానీ దీనికి ముందే బాబీ, అతని బాయ్ ఫ్రెండ్ అత్యంత దారుణంగా చంపబడతారు. దీనితో తన పాడ్ కాస్ట్ ద్వారా సంధ్య ఏం చేసింది? అసలు ఈ హత్యలు కేవలం అక్కడ నుంచే మొదలయ్యాయా? అంతకు ముందు ఆ తర్వాత కూడా ఉన్నాయా? వీటి వెనుక ఉన్నది ఎవరు? పోలీసులు ఈ కేసుని చేధించారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మొదటిగా శోభిత నుంచే మాట్లాడుకుంటే ఆమె తన రోల్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారని చెప్పొచ్చు. సంధ్య అనే యువకురాలిగా ఓ యంగ్ జర్నలిస్ట్ గా ఒక ఇన్వెస్టిగేటర్ గా పలు షేడ్స్ ని తాను బాగా ప్రెజెంట్ చేయడం జరిగింది. అలాగే విశ్వదేవ్ రాచకొండ కూడా తనకి ఉన్న స్క్రీన్ స్పేస్ లో బాగా నటించాడు.

అలాగే ఈ సినిమాలో దర్శకుడు ఎంచుకున్న పాడ్ కాస్ట్ అందులోని క్రైమ్ థ్రిల్లర్ అనే పాయింట్ కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే దీనికి అనుగుణంగా తీసుకెళ్లిన కథనం అక్కడక్కడా డీసెంట్ థ్రిల్ మూమెంట్స్ తో అలాగే సస్పెన్స్ తో సాగడం బాగుంది. ముఖ్యంగా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ లో మెయిన్ విలన్ ఎవరు అనేది రివీల్ చేసే పాయింట్ కూడా కీలకం దాన్ని నీట్ గా ప్రెజెంట్ చేసి రివీల్ చేయడం మంచి విషయం.

ఇక వీటితో పాటుగా సినిమాలో క్లైమాక్స్ పార్ట్ కూడా మెప్పిస్తుంది. నటి ఆమని తన రోల్ లో మంచి స్క్రీన్ ప్రెజెన్స్ తో కనిపించి మెప్పించారు. వడ్లమని శ్రీనివాస్ కి కూడా ఇందులో నీట్ రోల్ దక్కగా దానిని డిఫరెంట్ షేడ్స్ తో బాగా చేశారు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కోర్ పాయింట్ నిజంగా ఓ ఫ్రెష్ అంశమే కానీ ఇందులో నడిచే ట్రీట్మెంట్ మాత్రం అంత ఫ్రెష్ గా ఏమీ ఉండదు. పాడ్ కాస్ట్ సెటప్ అంతా బాగానే ఉంది కానీ క్రైమ్ ఎపిసోడ్స్ వాటి చుట్టూతా నడిచే కథనం మాత్రం ఒకింత రెగ్యులర్ ఫార్మాట్ లోనే మరీ ఎగ్జైట్ చేయకుండానే వెళ్లిపోయాయి.

ఈ తరహా సినిమాలకి మరింత థ్రిల్స్, ముఖ్యంగా లాజిక్స్, టెన్షన్ తో కూడిన సన్నివేశాలు పడితేనే కానీ వర్కౌట్ కావు. కానీ ఇలాంటి అంశాలు ఇందులో చాలా సింపుల్ గా తీసుకున్నట్టు అనిపిస్తుంది. వీటితో ఒక బలమైన గ్రిప్పింగ్ కథనం మిస్ అయ్యింది అని చెప్పాలి. అలాగే కథనంలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ లో సీరియస్ నెస్ లోపించింది. ఆ ఎపిసోడ్స్ అసహజంగా అనిపిస్తాయి.

అలాగే సంధ్య స్టార్ట్ చేసిన పాడ్ కాస్ట్ అంత తక్కువ సమయంలో అంత పాపులారిటీ ఎలా తెచ్చేసుకుందో కూడా అర్ధం కాదు. ఇలాంటివి అన్నీ ఈ థ్రిల్లర్ లో కొంచెం సినిమాటిక్ గా అనిపిస్తాయి. వీటితో పాటుగా సపోర్టింగ్ పాత్రలు రవీంద్ర విజయ్, ఝాన్సీ, సురేష్, విశ్వదేవ్ లాంటి నటులుకి అంత స్కోప్ ఇవ్వలేదు అనిపిస్తుంది. అంతేకాకుండా సినిమాలో కొంచెం ఎమోషనల్ డెప్త్ కూడా మిస్ అయ్యింది. ఇంకా కొన్ని సీన్స్ రిపీటెడ్ గా చూపిస్తున్నట్టు అనిపించడం బోర్ ఫీల్ కలిగిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాకి కావాల్సిన క్రైమ్ సెటప్ ని బాగా డిజైన్ చేసుకున్నారు. సినిమాలో మూడ్ ని మల్లికార్జున్ తన కెమెరా వర్క్ తో బాగా ప్రెజెంట్ చేశారు. అలాగే శ్రీచరణ్ పాకాల తన స్కోర్ తో సీన్స్ ని మరింత ఇంపాక్ట్ కలిగించేలా చూపించే ప్రయత్నం చేశారు. కే ఎస్ ఎన్ ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది.

ఇక దర్శకుడు శరన్ కొప్పిశెట్టి విషయానికి వస్తే.. ఒక డిఫరెంట్ సెటప్ లో అందరికీ తెలిసిన కథనే తీసుకున్నారు. కానీ దీనిని ఇంకా ఎంగేజింగ్ గా నడిపించి ఉంటే బాగుండేది. అందుకు స్కోప్ ఉంది కానీ బెటర్ రైటింగ్ ని ఇందులో ప్లాన్ చేసుకోవాల్సింది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘చీకటిలో’ క్రైమ్ థ్రిల్లర్ లో సెటప్ ఒకింత కొత్తగా అనిపిస్తుంది. అలాగే అక్కడక్కడా కొన్ని మూమెంట్స్ ఇందులో మెప్పిస్తాయి. సంధ్య రోల్ లో శోభిత బాగా చేశారు. అంతే కాకుండా ఇందులో అంతర్లీనంగా ఉండే సందేశం కూడా ఆలోచించేలా చేస్తుంది. కానీ ఈ క్రమంలో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన మూడ్ కొంచెం మిస్ అయ్యింది. ఇంకా గ్రిప్పింగ్ అండ్ ఇంట్రెస్ట్ గా సాగే సన్నివేశాలు ఇందులో జోడించి ఉండాల్సింది. సో ఈ క్రైమ్ థ్రిల్లర్ అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు