ఆర్ ఆర్ ఆర్ కోసం గద్దర్ సాంగ్..!

Published on Jan 9, 2020 3:00 am IST

ఎన్టీఆర్, రామ్ చరణ్‌ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉద్యమ వీరులైన కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రలకు కాల్పనికత జోడించి తెరకెక్కిస్తున్నారు.కాగా ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఈ సినిమాలో ఒక విప్లవ గేయం రాసి స్వయంగా పాడబోతున్నట్లు తెలుస్తోంది. కొమరం భీమ్‌పై ఓ పాట రాయమని రాజమౌళి, గద్దర్‌ను అడిగినట్లు తెలుస్తోంది. ఇక ఆ ఆఫర్‌ను గద్దర్ కాదనలేక పోయారని., అందుకే ఓ పాటను రాసి పాటబోతున్నారని సమాచారం. అంతేకాదు ఈ పాట సినిమా హైలెట్‌లలో ఒకటిగా నిలవనుందని తెలుస్తోంది.

కాగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నారు. అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ చిత్రం ఈ ఏడాది జూలై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :