కింగ్ నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆదివారం నుండి మైసూరులో ప్రారంభమవుతుంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారు. నాగార్జున ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో సందడి చేయనున్నారు.
‘హలో బ్రదర్’ తరహాలో వినోదాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో నాగార్జున మరదలిగా హాట్ యాంకర్ అనసూయ నటిస్తుంది. ఓ పాటలో హీరోతో కలిసి స్టెప్పులు వేస్తుందని సమాచారం. హంసా నందిని కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాత.


