సోగ్గాడే రిలీజ్ కి పక్కాగా ప్లాన్ చేస్తున్న నాగ్

సోగ్గాడే రిలీజ్ కి పక్కాగా ప్లాన్ చేస్తున్న నాగ్

Published on Nov 29, 2015 6:04 PM IST

Soggade-Chinni-Nayana

‘మనం’ సినిమా తర్వాత దాదాపు ఏడాది పైన గ్యాప్ తీసుకున్న కింగ్ నాగార్జున మరోసారి ద్విపాత్రాభినయంలో నటించిన సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. డిఫరెంట్ కథలని చేయడానికి ఇష్టపడే నాగ్ ఈ సారి ‘ఆత్మ’ల కాన్సెప్ట్ నేపధ్యంలో ఆధ్యంతం ప్రేక్షకులను నవ్వించేలా సోగ్గాడే చిన్ని నాయనాని తీర్చిదిద్దినట్లు సమాచారం. ఇప్పటికే ఈ చిత్ర టీం సంక్రాంతి బరిలో ఈ సోగ్గాడుని రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు, అలానే జనవరి 15వ తేదీని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు.

మాకు అందిన తాజా సమాచారం ప్రకారం నాగార్జున ఎన్ని సినిమాలు వచ్చినా కచ్చితంగా సంక్రాంతి సీజన్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడట. అందులో భాగంగానే తన సినిమాకి కావాల్సిన థియేటర్స్ ని అన్ని ఏరియాల్లో బ్లాక్ చేసుకుంటున్నాడట. చాలా ఏరియాలలో ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమా కోసం థియేటర్స్ ని ఫిక్స్ చేసారట. డిసెంబర్ లో ఈ సినిమా ఆడియోని రిలీజ్ చేసి అనుకున్న టైంకి రావడానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కూడా ఫినిష్ చేస్తున్నారు. నాగార్జున సరసన లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ డైరెక్టర్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకి నిర్మాత రాధా మోహన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు