బిగ్ బాస్ 4 – అరియానాకు గట్టి పరీక్షే పెట్టిన షోయెల్.!

బిగ్ బాస్ 4 – అరియానాకు గట్టి పరీక్షే పెట్టిన షోయెల్.!

Published on Dec 8, 2020 3:00 PM IST

Bigg Boss 4

ఇప్పుడు బిగ్ బాస్ 4 తెలుగు హౌస్ లో కేవలం ఆరుగురు ఇంటి సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. దీనితో ఇక నుంచి అసలు ఆట మొదలు కానుంది అని చెప్పాలి. బిగ్ బాస్ కూడా ఎవరిని ఎవరికీ హెల్ప్ చేసుకోడానికి వీలు లేకుండా అదిరిపోయే ట్విస్టును ఇచ్చారు. ఇక దీనితో ఈరోజు నుంచి హౌస్ లో కంటెస్టెంట్స్ నడుమ ఎలాంటి ఆట ఉంటుందో అని అంతా ఆశగా ఎదురు చూస్తుండగా ఈరోజే ఇద్దరి స్ట్రాంగ్ బాండ్ కు గట్టి పరీక్షలా కనిపిస్తుంది.

వారే షోయెల్ మరియు అరియానా. బిగ్ బాస్ ఎవరు ఎక్కువ ఓపికగా ఉంటారో అన్న టాస్క్ లో అరియనాను షోయెల్ దారుణంగా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేసాడు. ఆమెకు ఇష్టమైన బట్టలు వస్తువులను పాడు చేస్తూ అరియానా ఓపికకు నిజంగానే సిసలైన పరీక్ష పెట్టాడు. మరి దీనితో అరియానా సహనం కోల్పోయిందా లేదా వీరిద్దరి గొడవ స్టార్ట్ అవుతుందా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ ఎపిసోడ్ లో ఏం జరిగిందో అన్నది స్మాల్ స్క్రీన్ పై చూడాల్సిందే.

తాజా వార్తలు