హాట్ కేకుల్లా అవెంజర్స్ ఎండ్ గేమ్ టికెట్స్ !

Published on Apr 21, 2019 10:47 am IST

సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కు సీక్వల్ గా తెరకెక్కిన చిత్రం అవెంజర్స్ ఎండ్ గేమ్ . ఈ మచ్అవైటెడ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 26న విడుదలకానుంది. ఇక ఈ చిత్రం యొక్క టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడువుతున్నాయి. హైదరాబాద్ సిటీ లో ఈచిత్రం ఇంగ్లీష్ వెర్షన్ 3డి యొక్క బుకింగ్స్ ఓపెన్ కాగా బుక్ మై షో లో పెట్టిన కొన్ని నిమిషాలకే అన్ని మల్టీ ఫ్లెక్స్ లలో అన్నిషో ల టికెట్స్ అమ్ముడైయ్యాయి.

ఒక శుక్రవారమే కాదు శని , ఆది వారాలకు కూడా బుకింగ్స్ ఫుల్ ఆయ్యాయి అంటే ఈ చిత్రానికి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదలవుతుండటంతో ఆ రోజు తెలుగులో సినిమాలేవీ విడుదలకావడం లేదు.

సంబంధిత సమాచారం :