రవితేజ “ఖిలాడి”లో అదిరే యాక్షన్ సీక్వెన్స్.!

Published on Jun 19, 2021 8:00 am IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఖిలాడి”. దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే సాలిడ్ యాక్షన్ అంశాలతో కూడుకొని ఉన్నది అని మేకర్స్ మొదటి నుంచీ చెప్పుకొస్తున్నారు.

మరి అలా ఆ మధ్య ఇటలీలో ఓ సాలిడ్ యాక్షన్ సీన్ సహా పలు ఆసక్తికర సన్నివేశాల కోసం మేకర్స్ వెళ్లి షూట్ ని నిర్వహించారు. మరి అక్కడ రవితేజపై షూట్ చేసిన ఓ బైక్ ఛేజింగ్ సీక్వెన్స్ పైనే చిన్న షూటింగ్ క్లిప్ బయటకి వచ్చింది. ఆ క్లిప్ చూస్తే హాలీవుడ్ స్థాయి స్టంట్స్ గుర్తుకు రాక మానవు..

ప్రస్తుతం అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ఇక ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తుండగా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా పెన్ స్టూడియోస్ మరియు ఏ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :