భారీ ధరకు బాలయ్య “అఖండ” హిందీ రైట్స్?

Published on Jun 27, 2021 12:02 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం “అఖండ” అనే సాలిడ్ ప్రాజెక్ట్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఇప్పుడు లాస్ట్ స్టేజ్ షూటింగ్ కు రాగా సాలిడ్ యాక్షన్ సీక్వెన్ తో రీస్టార్ట్ చెయ్యనున్నారు.

మరి అలాగే ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతుందని ఆ మధ్య తెలిసింది. అయితే ఇపుడు ఈ సినిమా హిందీ డబ్బింగ్ కు సంబంధించి బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్ 14 కోట్ల మేర అమ్ముడు పోయినట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :