పుష్ప రాజ్ వర్సెస్ భన్వర్’..ఊహించని లుక్ లో ఫహద్.!

Published on Aug 28, 2021 10:48 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప”. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఇంట్రస్టింగ్ క్యాస్టింగ్ తో ఈ చిత్రం ఇప్పుడు తెరకెక్కుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మళయాళ స్టార్ అండ్ వెర్సిటైల్ నటుడు ఫహద్ ఫాజిల్ స్ట్రాంగ్ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరి తన రోల్ పై ఫస్ట్ లుక్ ని మేకర్స్ ఈరోజు రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ అప్డేట్ ని ఇప్పుడు మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. అయితే ఫహద్ కోసం కొంచెం తెలిసిన వాళ్ళు అయినా కూడా ఇలాంటి ఫస్ట్ లుక్ ని మేకర్స్ రివీల్ చేస్తారని ఊహించి ఉండరు. పూర్తిగా గుండు లుక్ లో అందులోని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించి ఆశ్చర్యపరిచాడు.

అలాగే ఈ చిత్రం తాను ‘భన్వర్ సింగ్ షేఖావత్’ అనే పోలీస్ గా కనిపించనున్నట్టు రివీల్ చేశారు. మొత్తానికి మాత్రం ఫహద్ ని నెగిటివ్ పోలీస్ గా సుకుమార్ ఎలా ప్రెజెంట్ చెయ్యనున్నారో అన్నది మరింత ఆసక్తిగా మారింది. మరి వేచి చూడాలి భన్వర్ వర్సెస్ పుష్ప రాజ్ ఎలా ఉంటుందో అన్నది. ఇక ఈ చిత్రానికి దేవీ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :