“దళపతి 67” పై సాలిడ్ అప్డేట్.!

“దళపతి 67” పై సాలిడ్ అప్డేట్.!

Published on Dec 25, 2022 3:00 PM IST

ప్రస్తుతం మన సౌతిండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న లేటెస్ట్ చిత్రాల్లో ఇళయ దళపతి విజయ్ మరియు కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సాలిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. విజయ్ కెరీర్ లో ఇది 67వ సినిమా కాగా లోకేష్ కనగ్ రాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది కూడా ఒకటి అనే మాట మూవీ లవర్స్ లో బాగా ఎగ్జైటింగ్ గా మారింది.

ఇక ఇదిలా ఉండగా ఏఈ సినిమాపై అయితే ఇప్పుడు మరిన్ని పలు ఎగ్జైటింగ్ సాలిడ్ అప్డేట్స్ తెలుస్తున్నాయి. ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ డ్రామాగా అయితే లోకేష్ ప్లాన్ చేస్తున్నాడట. అలాగే ఇండియా లో అనేక కీలక ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారని కూడా తెలుస్తుంది. అలాగే హాలీవుడ్ లెవెల్ యాక్షన్ డ్రామాగా ఇది కనిపించనుంది అని కూడా గట్టి టాక్ వినిపిస్తుంది. మరి లోకేష్ అయితే తన పీక్ ని లేటెస్ట్ గా విక్రమ్ సినిమాతో చూపించాడు. మరి ఈ సినిమా ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు