“RRR” లో ఆలియాకు సాలిడ్ రెమ్యునరేషన్.!

Published on Jun 12, 2021 1:00 pm IST

ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకున్న పలు పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శక ధీరుడు రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. ప్రతి అంశంలోనూ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్న రాజమౌళి క్యాస్టింగ్ పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బాలీవుడ్ స్టార్స్ ని రంగంలోకి దింపారు.

అలా ఈ చిత్రంలో సాలిడ్ రోల్ సీత కు గాను బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను రంగంలోకి దింపారు. అయితే ఈ చిత్రంలో ఆమె కనిపించే స్పేస్ తక్కువే అయినా కూడా తన ఇంటెన్సిటీ మాత్రం ప్రతి ఒక్కరినీ డామినేట్ చేస్తుంది అని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

మరి అంతటి ఇంపాక్ట్ కలిగిన రోల్ కు గాను ఆలియా కాస్త ఎక్కువే ఛార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఆలియా 6 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారట. ఇప్పుడు ఇదే సినీ వర్గాల్లో వైరల్ అవుతుంది. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆన్ టైం రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :