‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్

‘వాల్తేరు వీరయ్య’ టైటిల్ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్

Published on Dec 27, 2022 12:11 AM IST

మెగాస్టార్ చిరంజీవితో యువ దర్శకడు కె ఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ వాల్తేరు వీరయ్య ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మెగాస్టార్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఎంతో పవర్ఫుల్ సబ్జెక్ట్ తో బాబీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ కలిసి దీనిని నిర్మిస్తున్నారు.

ఇక ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ, శ్రీదేవి చిరంజీవి సాంగ్స్ రెండూ కూడా అందరినీ ఎంతో ఆకట్టుకోగా నేడు ఈ మూవీ నుండి టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. చంద్రబోస్ పవర్ఫుల్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్ కి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మరింత పవర్ఫుల్ ట్యూన్ ని అందించడం, అలానే దానిని యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి మరింత అద్భుతంగా పాడారు. ముఖ్యంగా యువత తో పాటు మాస్ ఆడియన్స్ ని ఈ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటూ ప్రస్తుతం యూట్యూబ్ లో 800కె వ్యూస్, 100కె లైక్స్ తో దూసుకెళుతోంది. కాగా వాల్తేరు వీరయ్య మూవీ 2023, జనవరి 13న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు