ప్రభాస్ “ఫౌజీ” నుంచి సాలిడ్ అప్డేట్ రెడీ!?

ప్రభాస్ “ఫౌజీ” నుంచి సాలిడ్ అప్డేట్ రెడీ!?

Published on Jun 30, 2026 10:14 AM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ లో చేస్తున్న భారీ పీరియాడిక్ ప్రాజెక్ట్ “ఫౌజీ” కూడా ఒకటి. అభిమానులు ఎగ్జైటెడ్ గా ఉన్న ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతూ వస్తుంది. మేకర్స్ కేవలం లుక్ పోస్టర్ అది కూడా తక్కువ డీటెయిల్స్ తో అందించారు. కానీ ఫైనల్ గా ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

దీని ప్రకారం ఓ గ్లింప్స్ లాంటిది సినిమా నుంచి అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని తోనే రిలీజ్ కోసం కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు టాక్. ప్రస్తుతానికి మేకర్స్ గ్రాండ్ లెవెల్లో చేస్తున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఇమాన్వి ప్రభాస్ సరసన నడుస్తుండగా మరింత మంది అగ్ర తారాగణం నటిస్తున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు