“ఉస్తాద్ భగత్ సింగ్” పై సాలిడ్ అప్డేట్.!

Published on Sep 12, 2023 2:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు తన సినిమాలు సహా పాలిటిక్స్ లో కూడా యమ బిజీగా ఉన్న సంగతి చూస్తూనే ఉన్నాము. అయితే ఇపుడు తాను నటిస్తున్న చిత్రాలు “ఉస్తాద్ భగత్ సింగ్” అలాగే “ఓజి” రెండు కూడా షూటింగ్ జరుగుతుండగా పవన్ ఇప్పుడు అయితే ఉస్తాద్ లో బిజీగా ఉన్నారు. మరి రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ షూట్ పవన్ లేని సన్నివేశాలతో స్టార్ట్ కాగా ఇప్పుడు అయితే పవన్ కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తుంది.

మరి ఇప్పుడు మేకర్స్ అయితే ఓ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని ఇప్పుడు తెరకెక్కిస్తున్నారట. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కాంబినేషన్ లో ఈ క్రేజీ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ తర్వాత వర్క్ చేస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :