విజయ్ సినిమాకు 200 కోట్ల ఆఫర్ ఎంత వరకు నిజం.?

Published on Jun 22, 2021 5:02 pm IST

ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్కసారిగా సడెన్ బ్లాస్ట్ లా హాట్ టాపిక్ అవుతుంది సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “లైగర్”. దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా పాన్ ఇండియన్ లెవెల్లో తెరకెక్కుతుంది. అయితే ఆల్ మోస్ట్ కంప్లీట్ కాబడిన ఈ చిత్రానికి ఏకంగా 200 కోట్లు ఆఫర్ ఓ ప్రముఖ ఓటిటి ఇచ్చింది అని టాక్ రావడంతో ఈ సినిమాకి ఆ రేంజ్ లోనా అని తెలిసే లోపే వైరల్ అయ్యిపోయింది.

అలాగే విజయ్ కూడా ఈ సినిమా థియేటర్స్ లోనే విడుదల అవుతుంది అని క్లారిటీ ఇచ్చాడు. సరే ఇవి పక్కన పెడితే అసలు ఈ చిత్రానికి ఇంత మొత్తంలో ఆఫర్ వచ్చింది అన్న దాంట్లో ఎలాంటి నిజం కూడా లేనట్టు తెలుస్తుంది. జస్ట్ రూమర్ మాత్రమే అని ఇంకా ఈ సినిమా చెంతకు ఎలాంటి ఓటిటి ఆఫర్ వెళ్ళనట్టుగా సినీ వర్గాల సమాచారం. అలాగే ఒకవేళ వచ్చినా కూడా ఇంత మొత్తంలో వచ్చి ఉండదని కూడా తెలుస్తుంది. మొత్తానికి మాత్రం మరోసారి విజయ్ సినిమా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయ్యిపోయింది.

సంబంధిత సమాచారం :