పవన్ ఈ రెండు సాలిడ్ ప్రాజెక్ట్స్ అనుమానమే.?

Published on May 19, 2021 3:09 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో డైరెక్ట్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా సమానంగానే ఉంటాయి. ఒకప్పుడు ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పటికీ పవన్ తన స్టార్డంను రీమేక్స్ కే ఉపయోగిస్తున్నారని పవన్ అభిమానుల్లో ఒక అభిప్రాయం ఉంది. సరే అవి పక్కన పెడితే ఈ ఏడాది వచ్చిన రీమేక్ “వకీల్ సాబ్” తో మాత్రం పవన్ సాలిడ్ ట్రీట్ ఇచ్చారు.

అలాగే దీని తర్వాత మళయాళ సూపర్ హిట్ “అయ్యప్పణం కోషియం” అనే క్రేజీ రీమేక్ కూడా స్టార్ట్ చేశారు. మరి దీనితో పాటుగా దర్శకుడు క్రిష్ తో మరో భారీ చిత్రం “హరిహర వీరమల్లు” కూడా లైన్ లో ఉంది. అయితే అన్నీ కరెక్ట్ గా ఉంటే అయ్యప్పణం రీమేక్ ఈ ఏడాదిలోనే విడుదల అయ్యేది వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఉంది.

కానీ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా రెండు సినిమాలు కూడా ఆన్ టైం రిలీజ్ అనుమానమే అని తెలుస్తుంది. దాదాపు అయితే అయ్యప్పణం రీమేక్ సంక్రాంతికి రావచ్చని నయా గాసిప్ సో వీరమల్లు ఆటోమాటిక్ గా దూరం జరగడం కన్ఫర్మ్. పైగా దీనికే ఎక్కువ షూట్ కూడా బ్యాలన్స్ ఉందని తెలుస్తుంది. మరి ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :