అభిజీత్ అండ్ హారికా విషయంలో ఆ లాజిక్స్ వదిలితే ఎలా.?

Published on Nov 29, 2020 6:03 pm IST

ఇప్పుడు మంచి రసవత్తరంగా మారినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 లో ఈ వారాంతం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక్కసారిగా అభిజీత్ ను టార్గెట్ చెయ్యడంతో భారీ ఎత్తున అటెన్షన్ వచ్చినట్టు అయ్యింది. దీనితో అభిజీత్ ఫాలోవర్స్ కాస్త అసహనంగా ఉన్నారు. ఇక అలాగే అభిజీత్ తో పాటుగా హారికాను కూడా కూడా టార్గెట్ చెయ్యడం కూడా వీక్షకుల్లో మంచి హాట్ హాట్ చర్చకు దారి తీసింది.

అయితే ముఖ్యంగా హారికాను అభిజీత్ కు ఫేవర్ ఉంటుంది అని ఉన్నది ఉన్నట్టే చెప్పారు సరే అది బాగానే ఉంది కానీ ఆ బిగ్ బాస్ హౌస్ లో కేవలం వారే కాకుండా ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఒకరికొకరు తమకి నచ్చిన వారికే ఫేవర్ గా నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి ఇప్పటి వరకు వారిని ఎప్పుడూ టార్గెట్ చెయ్యనిది స్పెషల్ గా ఇప్పుడే వీరిద్దరి విషయంలో చెయ్యడం ఏంటి అన్నది అసలు ప్రశ్న మరి వారి విషయంలో కనిపించని లాజిక్స్ వీరికే ఎందుకు కనిపించాయి అని ఫాలోవర్స్ కూడా అడుగుతున్నారు.

ఇప్పటి వరకు పలు సందర్భాల్లో ఒకరికొకరు సపోర్ట్ గా నిర్ణయాలు మార్చుకొని సేవ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అది మెహబూబ్ – షోయెల్ విషయంలో అయితేనేం, అఖిల్ – షోయెల్ విషయంలో అయితేనేం అలాగే అఖిల్ మరియు మోనాల్ ల విషయంలో అయితేనేం. ఇలా వీరందరూ ఒకరికోసం ఒకరు పలు సందర్భాల్లో సేవ్ చేసుకున్నారు. మరి అలాంటప్పుడు వీకెండ్స్ లో ఎవరినీ ఇంతలా ఎత్తి చూపింది లేదు. మరి కేవలం వీరినే ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది అసలు మ్యాటర్.

సంబంధిత సమాచారం :

More