“వకీల్ సాబ్”కు అక్కడ నష్టాలు తప్పేలా లేవు.!

Published on Apr 18, 2021 11:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “వకీల్ సాబ్”. బాలీవుడ్ హిట్ చిత్రం ‘పింక్’ కు రీమేక్ గా దర్శకుడు వేణు శ్రీరామ్ ఊహింసిన్హాని మార్పులు చేర్పులు చేసి వదిలారు. ఇక చాన్నాళ్ల తర్వాత పవన్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనికి ఓపెనింగ్స్ కూడా అంతే స్థాయిలో అదిరాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా వకీల్ సాబ్ కు ఓపెనింగ్ డే రోజున మంచి ఓపెనింగ్స్ దక్కాయి.

కానీ ఇప్పుడు మాత్త్రం అక్కడ ఈ చిత్రం గట్టెక్కడం కాస్త కష్టతరంగా మారేలా ఉందని చెప్పాలి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఒరిజినల్ వసూళ్ల లెక్కలు తెలియక ఎవరికీ నచ్చిన ఫిగర్స్ వాళ్ళు వేసుకుంటున్నారన్న టాక్ ఉంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం వకీల్ సాబ్ కు చిన్నపాటి నష్టాలు తప్పేలా లేవని చెప్పాలి.

ఎందుకంటే మేకర్స్ నుంచి అధికారికంగా ఓవర్సీస్ వసూళ్ల వివరాలను తెలియజేస్తున్నారు. అయితే అక్కడ 1 మిలియన్ డాలర్స్ కు పైగా ఉన్న టార్గెట్ కు ఇంకా 7 లక్షల డాలర్స్ కు పైగా మాత్రమే రాబట్టింది. మరి ఫుల్ రన్ లో పూర్తి మొత్తం కాస్త ప్రశ్నే అని చెప్పాలి. అయితే ఇందుకు మరో ప్రధాన కారణం మళ్ళీ పెరుగుతున్న కరోనా అని కూడా చెప్పొచ్చు. మరి లాంగ్ రన్ లో వకీల్ సాబ్ ఎక్కడ ఆగుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :