రజనీకాంత్ కావాలనే ఓటు వేయలేదట

Published on Jun 24, 2019 12:00 am IST

ఈరోజు తమిళ సినీ పరిశ్రమలో కీలకమైన నడిగర్ సంగం ఎన్నికలు జరుగుతున్నాయి. విజయ్, అజిత్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో పాటు హీరోయిన్లు, సీనియర్ నటీనటులు అందరూ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఓటు వేయలేదు. షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్లిన ఆయన పోస్టర్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని అనుకున్నానని, కానీ వాటికి సంబందించిన పేపర్లు ఆలస్యంగా అందడంతో ఓటు వేయలేకపోతున్నానని, ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నారు.

కొందరు దీన్ని మామూలుగానే తీసుకున్నా ఇంకొందరు మాత్రం విపరీతంగా ఆలోచిస్తున్నారు. రజనీ కావాలనే ఓటు వేయలేదని అంటున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికలు తారాస్థాయి వివాదాల నడుమ జరుగుతున్నాయి. దీని మూలంగా ప్రాంతీయత, మాతృ భాషల ప్రస్తావన కూడా వచ్చింది. పరిశ్రమ రెండుగా చీలింది. ఇరు వర్గాల నడుమ స్నేహపూర్వక వాతావరణమే లేదు. ఇలాంటి వివాదాల నడుమ ఎవరో ఒకరికి సపోర్ట్ చేసి మిగిలిన వారిని, వారి అభిమానుల్ని ఇబ్బంది పెట్టి చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని ఆలోచించి రజనీ ఓటు వేయలేదని అంటున్నారు. మరి వీరి వాదన పట్ల రజనీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More