
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘S/O సత్యమూర్తి’. గత గురువారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా సమ్మర్ బన్ని – త్రివిక్రమ్ కాంబినేషన్, సమ్మర్ సీజన్ కావడం, సినిమాలు ఏమీ లేకపోవడం వలన బాక్స్ ఆఫీసు వద్ద కలెక్షన్స్ వరదలా వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల మార్క్ ని క్రాస్ చేసిందని నిన్ననే తెలియజేశాం. ఓవరాల్ గానే కాకుండా ఏరియాల పరంగా కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని సాధిస్తోంది.
‘S/O సత్యమూర్తి’ ఒక్క నైజాంలో నాలుగు రోజుల్లో 7.80 కోట్లు కలెక్ట్ చేసింది. నిన్న సోమవారం అయినప్పటికీ కలెక్షన్స్ లో పెద్దగా డ్రాప్స్ లేవు. నిన్నకూడా నైజాంలో 98 లక్షల షేర్ సాధించి మొత్తం 5 రోజుల్లో 8.78 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు కావడంతో ఈ రోజు కూడా 1 కోటి షేర్ ని క్రాస్ చేస్తుందని అంటున్నారు. అలాగే మొదటి వారంలో మొత్తంగా 11 కోట్ల కోట్ల షేర్ క్రాస్ చేస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మిక్స్డ్ టాక్ వచ్చినా ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం బన్ని – త్రివిక్రమ్ కాంబినేషన్ పై ఉన్న అంచనాలే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, ఆద శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో ఉపేంద్ర, రాజేంద్ర ప్రసాద్, స్నేహ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు.

