
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ కి ఈక్వల్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ అనుష్క. ఈ ఏడాది బాహుబలి, రుద్రమదేవి సినిమాలతో హిట్ అందుకున్న అనుష్క ఈ వారం సైజ్ జీరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్ర సీమల్లో అందరినీ ఆకర్షిస్తున్న సినిమా ‘సైజ్ జీరో’ దానికి ప్రధాన కారణం అనుష్క ఈ సినిమా కోసం 20 కేజీల బరువు పెరిగి బాగా బొద్దుగా మారి ఈ సినిమా చేయడమే దీనికి కారణం. నవంబర్ 27న మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సినిమాలో అనుష్కతో పాటు మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ కూడా కనిపించనుంది. సోనాల్ చౌహాన్ ఇందులో ఓ ఎన్నారై గర్ల్ గా కనిపించనుంది. ఈ పాత్రలో సోనాల్ చౌహాన్ మోడ్రన్ లుక్ సినిమాకి గ్లామర్ అట్రాక్షన్ గా నిలుస్తుందని అన్నారు. అలాగే సోనాల్ చౌహాన్ పాత్రలో గ్లామర్ తో పాటు కాస్త ఫన్ కూడా ఉంటుందని సమాచారం. ఆర్య హీరోగా నటించిన ఈ సినిమాకి ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు. పివిపి బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో కలిసి సుమారు 1500 థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్.

