సాంగ్ షూటింగ్ లో మజిలీ !

సాంగ్ షూటింగ్ లో మజిలీ !

Published on Jan 27, 2019 5:30 PM IST

Majili1

నాగ చైతన్య , సమంత జంటగా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మజిలీ’. ప్రస్తుతం ఈ చిత్రం వైజాగ్ లోని ఓల్డ్ సిటీ ఏరియాలో సాంగ్ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ ఈచిత్రం. రొమాంటిక్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో నాగ చైతన్య క్రికెటర్ పాత్రలో నటిస్తున్నారు.

గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో హిందీ నటి దివ్యంక కౌశిక్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా ,పోసాని కృష్ణ మురళి , రావు రమేష్ ,సుబ్బరాజు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ పతాకం ఫై సాహు గారపాటి , హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 5న విడుదలకానుంది.

తాజా వార్తలు