సోనూ సూద్ నుంచి మరో గ్రేట్ మూవ్.!

Published on May 11, 2021 12:00 pm IST

గత ఏడాది కరోనా మన దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ప్రతీ ఒక్క భారతీయుడికి బలమైన భరోసాలా నిలిచిన రియల్ హీరో సోనూ సూద్. నిరంతర శ్రామికుడిలా ఇప్పటికీ కూడా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపద్భాంధవుడిలా నిలిచాడు. మరి ఇప్పుడు మరో ఊహించని గ్రేట్ మూవ్ తో మళ్ళీ దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరి మన్ననలు పొందుతున్నాడు.

తాజాగా సోనూ సూద్ ఫ్రాన్స్ దేశం నుంచి ఏకంగా నాలుగు ప్రాణవాయు(ఆక్సిజెన్) ప్లాంటులను తీసుకొచ్చి భారత్ లో నిలపడానికి పూనుకున్నాడు. అత్యవసరంగా ఏ రాష్ట్రాల్లో అయితే వాటి అవసరం ఉంటుందో అక్కడ స్థాపించనున్నట్టు తెలుస్తుంది. ఇది నిజంగా సోనూ సూద్ నుంచి మరో గ్రేట్ మూవ్ అని చెప్పాలి. ప్రస్తుతం సోనూసూద్ “ఆచార్య”, “హరిహర వీరమల్లు” లాంటి ప్రముఖ చిత్రాల్లో నటిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :