‘మా’ ఎన్నికల బరిలో సోనూసూద్?

Published on Jul 9, 2021 3:05 am IST

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా మారబోతున్నాయి. ఈ సారి ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, సీవీఎల్ నరసింహారావు వంటి వారు పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించేశారు. ఇక ఎన్నికలు సెప్టెంబర్ నెలలో ఉన్నప్పటికి అప్పుడే కొందరు ప్రచారాన్ని మొదలుపెట్టేశారు. ప్రకాశ్ రాజ్ అయితే ఒకడుగు ముందుకేసి తన ప్యానెల్‌ని కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలోనే లోకల్-నాన్ లోకల్ అని, ఆంధ్రా-తెలంగాణకు వేరువేరుగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్స్ ఉండాలన్న పలు అంశాలు తెరపైకి రాగా, ఈ సారి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ ఉండొచ్చన్న అంశాలు కూడా oa pakka nunchi వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సారి రియల్ హీరో సోనూసూద్‌ను కూడా ‘మా’ ఎన్నికల బరిలో నిలిపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్న పుకారు ఒకటి బయటకొచ్చింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎంతో మందికి, ఎన్నో విధాలుగా సాయం అందించి దేశ వ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సోనూ సూద్‌ను బరిలోకి దింపితే ప్రకాష్ రాజ్‌కు చెక్ పెట్టొచన్న ఆలోచనలతో కొందరు సినీ ప్రముఖులు తెర వెనుక పావులు కదుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల సోనుసూద్ మంత్రి కేటీఆర్‌ను కలవడం కూడా ఈ రూమర్స్‌కి ఆజ్యం పోసినట్టు అయ్యింది. అయితే ఇందులో ఎంతవరకు నిజముందనేది తెలీదు కానీ ఇదే కనుక నిజమై సోనూ కనుక బరిలోకి దిగితే వార్ వన్ సైడ్ అవుతుందనే చెప్పాలి.

సంబంధిత సమాచారం :