హైదరాబాద్‌కి మకాం మార్చిన సోనూసూద్?

Published on Jul 16, 2021 2:01 am IST

మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా స్టార్లుగా మారుతుండడంతో ముంబైకి మకాం మార్చాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే ముంబైలో ఇళ్లు, ప్లాట్‌లు కొనేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ముంబైలో ఇళ్లు తీసుకోగా, రాంచరణ్ దంపతులు సైతం ఇటీవల ముంబైలో ఫ్లాట్ కొన్నారు. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్2’ సహా పలు సినిమాల్లో వెబ్ సిరీస్‌లలో అవకాశాలు రావడంతో సమంత కూడా ముంబైలో ప్లాట్ తీసుకునేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది.

అయితే కరోనా కష్ట కాలంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేస్తూ దేశ వ్యాప్తంగా రియల్ హీరో అని పేరు తెచ్చుకున్న సోనూసూద్ మాత్రం ముంబై నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సోనూసూద్‌కు హిందీలో కంటే తెలుగులోనే ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌కు ఎప్పుడొచ్చినా పార్క్ హయత్ హోటల్‌లోనే సోనూసూద్ బస చేసేవారు. అయితే షూటింగ్‌ల నేపధ్యంలో ఎక్కువ కాలం హైదరాబాద్‌లోనే ఉండాల్సి రావడవంతో ఇక్కడే ఓ సొంత ఇళ్లు కొనుక్కోవాలని సోనూసూద్ నిర్ణయించుకున్నాడట. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ లో రూ.10 కోట్లతో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడని ప్రచారం జరుగుతుంది. త్వరలోనే గృహ ప్రవేశం కూడా చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే సోనూసూద్‌కి ఇప్ప‌టికే ముంబైలో ఓ ఇళ్లు, అక్క‌డే ఒక హోట‌ల్ కూడా ఉంది.

సంబంధిత సమాచారం :