బిగ్గెస్ట్ వాక్సినేషన్ డ్రైవ్ లో తన వాక్సిన్ తీసుకున్న రియల్ హీరో.!

Published on Apr 7, 2021 2:00 pm IST

ఇప్పుడు మళ్ళీ దేశంలో కరోనా రెండో వేవ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో చూస్తూనే ఉన్నాం. అలాగే ఇప్పటికే మొదలైన వాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో విస్తృతంగా జరుగుతుంది. అయితే ఇటీవల బాలీవుడ్ లో కరోనా బారిన అనేక మంది బాలీవుడ్ స్టార్స్ కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాబడ్డారు. అయితే గత ఏడాది ఇదే కరోనా తీవ్ర రూపం దాలుస్తున్న సమయంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ ఎలాంటి సేవలని అందించాడో తెలిసిందే.

దీనితో అక్కడ నుంచి రియల్ హీరోగా పేరు గాంచిన సోనూ ఇప్పటికీ తన సేవలను అందిస్తూ వస్తున్నాడు. మరి లేటెస్ట్ గా తాను ఇండియా లోనే అతి పెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అయినటువంటి “సంజీవిని” డ్రైవ్ లో తాను కూడా వాక్సిన్ తీసుకున్నట్టుగా తెలిపారు. అంతే కాకుండా తన దేశంలో ప్రతీ ఒక్కరూ వాక్సినేటెడ్ కావాలని కోరుకున్నారు.

సంబంధిత సమాచారం :