టెంపర్ రీమేక్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు !

టెంపర్ రీమేక్ లో నటిస్తున్న ప్రముఖ నటుడు !

Published on Sep 17, 2018 11:33 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘టెంపర్’ ఇప్పుడు హిందీ , తమిళ భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం హిందీలో ‘సింబా’ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. యువ హీరో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో సోనుసూద్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన షూటింగ్లో జాయిన్ అయ్యారు.

సారా అలీ ఖాన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ అతిధి పాత్రలో మెరవనున్నారు. కరణ్ జోహార్, రోహిత్ శెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈచిత్రాన్ని ఈఏడాది డిసెంబర్ 28 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు