
‘యజ్ఞం’, ‘రణం’, ‘లక్ష్యం’, ‘శౌర్యం’, ‘లౌక్యం’.. ఇలా టైటిల్ చివర ‘ం’ వచ్చే సినిమాలతో మంచి విజయాలు అందుకున్న హీరో గోపీచంద్, తాజాగా ఇదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేస్తూ ‘సౌఖ్యం’ అనే సినిమాతో సిద్ధమైన విషయం తెలిసిందే. ‘పిల్లా నువ్వులేని జీవితం’తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా రానున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాల్లో ఒకటిగా నిలిచిందని చెప్పుకోవచ్చు.
ఇప్పటికే పోస్టర్స్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో కూడా ఈ మధ్యే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఇప్పటికే అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నేటితో సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని క్రిస్మస్కు ఒకరోజు ముందుగానే, అంటే డిసెంబర్ 24నే విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ బృందం ఈ సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. భవ్య క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో గోపీచంద్ సరసన రెజీనా హీరోయిన్గా నటించారు. గోపీచంద్ మార్క్ యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూనే ఫ్యామిలీ ఎమోషన్‌కు పెద్ద పీట వేశారని తెలుస్తోంది.

