సెన్సార్ కి సిద్దమైన గోపీచంద్ ‘సౌఖ్యం’

సెన్సార్ కి సిద్దమైన గోపీచంద్ ‘సౌఖ్యం’

Published on Dec 15, 2015 12:30 PM IST

Soukyam
వరుసగా హ్యాట్రిక్ హిట్స్ అందుకొని ఫుల్ జోష్ మీదున్న మాచో హీరో గోపీచంద్ తనకి ‘యజ్ఞం’ రూపంలో మొదటి బిగ్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరి డైరెక్షన్ లో చేసిన మరో సినిమా ‘సౌఖ్యం’. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమాని సెన్సార్ కి పంపడానికి స్లాట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. రేపు అనగా డిసెంబర్ 16న ఈ సౌఖ్యం సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ ని పూర్తి చేసుకోనుంది.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేయనున్న ఈ సినిమా సెన్సార్ ని 10 రోజుల ముందే ఫినిష్ చేసి రిలీజ్ కి పక్కాగా రెడీ చేసుకోవాలని ఈ చిత్ర టీం నిర్ణయించుకుంది. సెన్సార్ పూర్తి చేసుకున్నాక ఈ సినిమా భారీ ఎత్తున ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నారు. కోన వెంకట్ – గోపి మోహన్ లు కథని అందించిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు. రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు.

తాజా వార్తలు