ముందుకొచ్చిన ‘సౌఖ్యం’ రిలీజ్ డేట్..!

ముందుకొచ్చిన ‘సౌఖ్యం’ రిలీజ్ డేట్..!

Published on Dec 16, 2015 8:38 PM IST

Soukyam
టాలీవుడ్ లో వరుస విజయాలతో ముందుకు సాగుతున్న మాచో హీరో గోపీచంద్ ప్రస్తుతం తన తాజా సినిమా ‘సౌఖ్యం’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. గతంలో గోపీచంద్ కు ‘యజ్ఞం’ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఎఎస్ రవికుమార్ చౌదరి సౌఖ్యం సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఆడియో రిలీజ్ కూడా అయిపోయిన సౌఖ్యం సినిమాను ఈ నెల 25న రిలీజ్ చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు.

అయితే, ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సౌఖ్యం సినిమా డిసెంబర్ 24వ తేదీనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సినిమా రిలీజ్ డేట్ ను ముందుకు జరపడానికి గల కారణాన్ని యూనిట్ ఇంకా వెల్లడించలేదు. ఏదిఏమైనా సినిమా లవర్స్ కు మాత్రం ఇది ఒకరకంగా గుడ్ న్యూస్ గా మారింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ వారు నిర్మించారు. గోపీచంద్, రెజీనా కసాండ్ర హీరో హీరోయిన్లగా నటించగా, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.

తాజా వార్తలు