“పుష్ప” టీజర్ కోసం ప్రముఖ ఎడిటర్ ని దింపారట.!

Published on Apr 7, 2021 12:04 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “పుష్ప”. భారీ బడ్జెట్ తో సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఇదిలా ఉండగా ఈరోజు ఈ సినిమా టీజర్ వస్తున్న సంగతి తెలిసిందే. దానికి ఆల్రెడీ అన్ని పనులు జరిగాయి.

అయితే ఈ టీజర్ కు గాను మేకర్స్ మంచి ప్లానింగ్ లే వేసారట.ఆ అందుకే ఈ పుష్ప టీజర్ ను కట్ చేసేందుకు కోలీవుడ్ లో బడా స్టార్స్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్, థలా అజిత్ మరియు విజయ్ సినిమాలకు పని చేసిన ప్రముఖ ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ని దింపారట.

మరి తాను కట్ చేసిన ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :