తనకెలాంటి అనారోగ్యం లేదన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం !


గత కొన్నిరోజులుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషయమై అనేక రకాలైన రూమర్స్ వస్తున్న సంగతి విథితమే. ఎస్పీబీ బాగా అనారోగ్యం పాలయ్యారని, కాబట్టే అన్ని ప్రదర్శనలను రద్దు చేసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన ఎస్పీబీ తనకు ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరో సోషల్ మీడియాలో కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు.

తనకు చిన్నపాటి దగ్గు., జలుబు వచ్చి డాక్టర్ ను కలిసినా చూసే వాళ్లంతా తనకేదో అయిందని అనుకోవడం సరికాదని. అలాంటో రూమర్స్ స్ప్రెడ్ చేయడం ఎదుటివారి మనిభావాలను దెబ్బతీయడమేనని హితవు పలికారు. తన సోదరి చనిపోవడం మూలాన ప్రదర్శనలను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ప్రస్తుతం తాను స్వరాభిషేకం షో షూటింగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నానని కూడా తెలిపారు.