“సర్కారు వారి పాట”లో వీటిపై స్పెషల్ కాన్సంట్రేషన్.?

Published on Sep 22, 2020 7:02 am IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. మరో హ్యాట్రిక్ కు మహేష్ ఈ సినిమాతో నాంది పలికారు. అయితే దర్శకుడు పరశురాం ఈ చిత్రాన్ని మాత్రం చాలా సూపర్ స్పెషల్ గా తీసుకున్నారు.

కేవలం ప్రీ లుక్ పోస్టర్ తోనే మాస్ లో కావాల్సిన అటెన్షన్ ని తెచ్చుకున్న ఈ దర్శకుడు ఈ చిత్రంలో మహేష్ పై తీయనున్న మాస్ ఫ్లిక్ సీన్స్ ను స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారట. కేవలం ఫైట్స్ లో మాత్రమే కాకుండా ఇతర సన్నివేశాలు అంటే డైలాగ్స్, డ్రెస్సింగ్ లో కూడా మాసివ్ నెస్ పుష్కలంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే నవంబర్ లో ఈ చిత్రం షూట్ మొదలు కానుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతుంది.

సంబంధిత సమాచారం :

More