‘రాంగోపాల్ వ‌ర్మ’ చెప్పేదంతా సోల్లే !

Published on Apr 29, 2019 1:25 pm IST

ద గ్రేట్ రామ్‌గోపాల్ వ‌ర్మ కెరీర్ మెద‌ట్లో శివ‌, క్ష‌ణక్ష‌ణం అద్బుత‌మైన‌ చిత్రాలు తీసి చాలా మంది యూత్ ని ద‌ర్శ‌త్వం వైపు రావ‌టానికి మార్గం వేసిన గురువు.. కానీ ఇప్ప‌డు రామ్‌గోపాల్ వ‌ర్మ తీస్తున్న నాసిర‌కం చిత్రాలు ఆఫీస‌ర్‌, ల‌క్ష్మీస్ ఎన్టీఆర్, ఐస్‌క్రీమ్ లు చూస్తుంటే ప్రేక్షకులతో పాటు, అటు వర్మ అభిమానులుకు కూడా కొపం వ‌స్తుంది.

స్పెష‌ల్ చిత్రం ద‌ర్శ‌క‌డు ‘వాస్తవ్‌’ మాట్లాడుతూ… రామ్‌గాపాల్‌వ‌ర్మ చెప్పేది అంతా సొల్లు.. సొల్లు మాత్ర‌మే.. చాలా మంది అత‌నికి పిచ్చి ప‌ట్టిందేమె అనుకుంటున్నారు. ఆయ‌న అభిమానిగా నేను స్పెష‌ల్ చిత్రాన్ని తీసాను. ఒక్కసారి నా చిత్రం చూసి అప్పుడు మాట్లాడు రామ్‌గోపాల్ వ‌ర్మ.. అంతేకాదు ఇటీవ‌ల్ మందు తాగి ఎవ‌డో రాసిచ్చిన పాటని పాడి సోష‌ల్ మీడియాలో పెట్టావ్.. మినిమ‌మ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్న నువ్వు శివ అనే ఛారిత్రాత్మ‌క చిత్రాన్ని తీసావంటే న‌మ్మ‌లేకున్నాము. నీలాంటి వాడిని నమ్మి నిర్మాత‌లు, న‌టీన‌టులు మెస‌పోతున్నారు. అని త‌న సోష‌ల్ మీడియాలో ద్వ‌జ‌మెత్తాడు స్పెష‌ల్ చిత్రం ద‌ర్శ‌క‌డు ‘వాస్తవ్‌’.

సంబంధిత సమాచారం :