సమీక్ష : స్పెషల్ – ఆసక్తికరంగా సాగని క్రైమ్ డ్రామా !

సమీక్ష : స్పెషల్ – ఆసక్తికరంగా సాగని క్రైమ్ డ్రామా !

Published on Jun 22, 2019 2:58 AM IST
Special movie review

విడుదల తేదీ : జూన్ 21, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : అజయ్‌, రంగా, అక్షిత తదితరులు.

దర్శకత్వం : వాస్తవ్‌

నిర్మాత : వాస్తవ్

సంగీతం : మన్యమ్

సినిమాటోగ్రఫర్ : అమర్ కుమార్

వాస్తవ్‌ దర్శకత్వంలో అజయ్‌, రంగా, అక్షిత కీలక పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘స్పెషల్‌’. నందలాల్‌ క్రియేషన్స్‌ సంస్థ పై మైండ్‌ రీడర్‌ లవ్‌ రివేంజ్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

రంగా (రంగా) ఒక మైండ్‌ రీడర్‌. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ రంగాకి ఉంటుంది. అయితే రంగా మెడికల్ స్టూడెంట్ గా ఉన్న రోజుల్లో అతని జీవితంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల కారణంగా అతను ఒక సైకో కిల్లర్ గా మారిపోతాడు. తన జీవితం అలా మారడానికి కారణమైన ఓ నలుగురు వ్యక్తుల పై రివేంజ్‌ తీర్చుకోవటానికి తనకున్న తెలివితేటలను మరియు తన మైండ్‌ రీడర్‌ స్కిల్ ను వాడతాడు. ఈ క్రమంలో రంగాను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ అజయ్ అనధికారికంగా నియమించబడతాడు. ఆ తరువాత వీరి మధ్య జరిగిన కొన్ని సంఘటనల అనంతరం రంగా తమను కూడా వాడుకొని తన రివేంజ్ తీర్చుకుంటున్నాడని ఆజేయ్ కి అర్ధమవుతుంది. ఆ తరువాత రంగాని పట్టుకోవటానికి ఆజేయ్ ఏమి చేశాడు ? అసలు రంగా ఎందుకు రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు ? ఎవరి మీద రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాడు ? అసలు రంగా అలా మారడానికి గల కారణాలు ఏమిటి ? రంగ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలు ఏమిటి ? చివరికి రంగా తన రివేంజ్ తీర్చుకున్నాడా ? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

దర్శకుడు వాస్తవ్‌ మైండ్ రీడ్ కి సంబంధించి తీసుకున్న స్టోరీ పాయింట్ చాల బాగుంది. ఆ పాయింట్ ఎలివేట్ చేయటానికి ఆయన రాసుకున్న కొన్ని సన్నివేశాలు కూడా బాగున్నాయి ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన రంగా తన పాత్రకు తగ్గట్లు.. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. ముఖ్యంగా కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరోయిన్ గురించి అసలు నిజం తెలిసే సన్నివేశంలో గాని, క్లైమాక్స్ సన్నివేశంలో గాని రంగా చాలా బాగా నటించాడు.

ఇక హీరోయిన్ గా నటించిన అక్షిత హీరోయిన్ మెటీరియల్ కాకపోయినా తన పాత్రకు తగ్గట్లు అవలీలగా నటించి ఆకట్టుకుంది. సినిమాలో మరో ప్రధాన పాత్రలో కనిపించిన ఆజేయ్ తన పాత్రలో ఒదిగిపోయారు. తన టైమింగ్ తో అక్కడక్కడా ఎంటర్ టైన్ చేస్తూనే.. సినిమాలో సీరియస్ నెస్ ను మరియు టెన్షన్ ను తన నటనతో బాగా తీసుకువచ్చారు. హీరోకి ఆయనకు మధ్య సాగే సన్నివేశాలు బాగున్నాయి. హీరో లవర్ గా నటించిన నటి కూడా తన నటనతో ఆకట్టుకుటుంది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్:

 

మైండ్ రీడ్ కి సంబంధించి దర్శకుడు వాస్తవ్ మంచి స్టోరీ పాయింట్ తీసుకున్నా.. ఆయన రాసుకున్న కథాకథనాల్లో ప్లో మిస్ అయింది. ముఖ్యంగా ఆయన రాసుకున్న కథనం ఆకట్టుకొన్నే విధంగా సాగలేదు. ఏ సీన్ కి ఆ సీన్ బాగుంది అనిపించినా, ఓవరాల్ గా కథలో మిళితమయ్యి ఉండవు. దీనికి తోడు సినిమా అక్కడక్కడా స్లోగా సాగుతూ బోర్ కొడుతుంది. సినిమాలో ట్విస్ట్ లు బాగానే పెట్టారు గాని అవి థ్రిల్ చెయ్యవు.

దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తరువాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపిస్తోంది. పైగా ఆ సీన్స్ అన్ని కూడా.. ఒకేలా సాగుతాయి. ఈ రిపీట్ డ్ సీన్స్ వల్ల సినిమా ప్లో దెబ్బ తింది. అయినా ప్రేమ కోసం, ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైనా తెగిస్తోన్న హీరో ఏం అయిపోతాడో అనే ఒక పెయిన్ ఫుల్ కంటెంట్ సినిమాలో ఉన్నా… దర్శకుడు మాత్రం ఆ కంటెంట్ ఆధారంగా ఆసక్తికరంగా సినిమాను మలచలేకపోయారు.

 

సాంకేతిక విభాగం :

 

ఇక సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు మన్యమ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంటుంది. ఎడిటర్ ఎడిటింగ్ పనితనం బాగుంది గాని, సెకండాఫ్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. అమర్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకున్నేలా ఉంది. ఇక నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కథకు అవసరమైనంత ఖర్చు పెట్టారు.

 

తీర్పు :

 

వాస్తవ్‌ దర్శకత్వంలో అజయ్‌, రంగా, అక్షిత కీలక పాత్రధారులుగా వచ్చిన ఈ ‘మైండ్‌ రీడర్‌ రివేంజ్‌ డ్రామా’ ఆకట్టుకునే విధంగా సాగలేదు. కానీ రంగా హీరోగా చేసిన ఈ తొలి ప్రయత్నం ఆయనకు మాత్రం మంచి ఫలితాన్నే ఇస్తుంది. సినిమాలో తన నటనతో, మ్యానరిజమ్స్ తో.. రంగా హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక దర్శకుడు వాస్తవ్‌ మైండ్ రీడ్ కి సంబంధించి తీసుకున్న స్టోరీ పాయింట్, అలాగే ఆయన రాసిన కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కథలో ముఖ్యమైన కొన్ని కీలక సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఓవరాల్ గా సినిమాని మాత్రం ఆయన ఆసక్తికరంగా మలచలేకపోయారు. సినిమాలో ఇంట్రస్ట్ గా సాగని సన్నివేశాలతో విసుగు తెప్పిస్తారు. మొత్తం మీద ఈ ‘మైండ్‌ రీడర్‌ లవ్‌ రివేంజ్‌ డ్రామా’ నిరాశ పరిచింది. మరి ఇలాంటి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు