అంధుల కోసం ‘బ్రూస్ లీ’ ప్రీమియర్ షో!

అంధుల కోసం ‘బ్రూస్ లీ’ ప్రీమియర్ షో!

Published on Oct 15, 2015 8:01 PM IST

Bruce-Lee
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శ్రీనువైట్ల రూపొందించిన ‘బ్రూస్ లీ’ సినిమా మరో కొన్ని గంటల్లో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. ఈ దసరా సీజన్‌లో భారీ అంచనాల మధ్యన విడుదలవుతోన్న అతి పెద్ద సినిమా కావడంతో బ్రూస్ లీ పట్ల అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌కు అన్నిచోట్లా అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇక ఇదిలా ఉంటే అంధుల కోసం ‘బ్రూస్ లీ’ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత వారం దేవ్‌నార్ స్కూల్‌ను సందర్శించిన రామ్ చరణ్, ఆ సందర్భంగా వారికి బ్రూస్ లీ స్పెషల్ షో ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలోనే హైద్రాబాద్‌లోని ఐమాక్స్‌లో ఈ ప్రీమియర్ షోను ఈ సాయంత్రానికి ఏర్పాటు చేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైన ఈ ప్రీమియర్ షోకు ‘బ్రూస్ లీ’ టీమ్‌తో పాటు దేవ్‌నార్ పాఠశాలకు చెందిన అంధ విద్యార్థులు, పలువురు ఇతర తెలుగు సినీ ప్రముఖులు హాజరయ్యారు. రామ్ చరణ్ ఈ షోను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో పాటు షోకు విచ్చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు